
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శనివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. సిట్ కేసీఆర్ జేబు సంస్థ అని, దానితో ఉపయోగం లేదన్నారు. పేపర్ల లీకేజీలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, 30 లక్షల మంది నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచేశారని, ఆ ప్రాజెక్టును ముందుగా రాష్ట్ర ప్రజలకు ముందుగా చూపించాలన్నారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని సబ్సిడీలను బంద్ చేశారన్నారు.