నిజామాబాద్, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టుకు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. జోన్-1 కింద ఉన్న కాకతీయ కెనాల్‌కు 3,500 క్యూసెక్కుల నీరు వదిలారు. ఈ జోన్ పరిధిలోని డీ05 నుంచి డీ53 కెనాల్స్ కింద ఉన్న పంటలకు నీరు అందనుంది. జోన్ 1 పరిధిలోని కాల్వలకు వారం పాటు నీటిని విడుదల చేయనున్నారు. తర్వాత జోన్ -2లోని డీ54 నుంచి డీ94 కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. సరస్వతీ కెనాల్‌కు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలకు ముందు ప్రాజెక్ట్ ఇంజినీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
