
గవర్నర్ తమిళిసైని యాదాద్రి ప్రారంభోత్సవానికి అహ్వానించకపోవడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ సొంత భూమిలో ఆలయ నిర్మాణం చేసినట్టు, సొంత పార్టీ నాయకులను ఆలయ శంకుస్థాపనకు పిలుచుకున్నాడన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన యాదగిరిగుట్ట పేరును మార్చి ప్రజల మనోభావాలు దెబ్బ తీశాడన్నారు. మహిళలను గౌరవించలేని కేసిఆర్ కు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చునే అర్హత లేదన్నారు డీకే అరుణ. యాదాద్రిని కేసీఆర్ సొంత ఖర్చులతో నిర్మించలేదన్నారు. యాదగిరిగుట్ట కేసీఆర్ సొంత ఆస్తి కాదన్నారు.