డికె అరుణకు గ్రాండ్ వెల్ కం చెప్పిన లక్ష్మణ్

డికె అరుణకు గ్రాండ్ వెల్ కం చెప్పిన లక్ష్మణ్

మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరిన తర్వాత మొదటి సారిగా హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసుకు వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డీకే అరుణకు స్వాగతం పలికారు. డీకే అరుణకు లక్ష్మణ్ బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఏక పక్షంగా పాలన జరుగుతోందన్నారు. మంత్రులు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని దుస్థితి  ఉందన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజక వర్గాలు తప్ప ఏ నియోజకవర్గం అభివృద్ధి కాలేదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేతోనే సాధ్యమన్నారు. మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో 4 నుండి 5 స్థానాలు బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని..టీఆర్ఎస్ కేవలం ఓటు రాజకీయాలతో ముందుకెళ్తుందని అరుణ విమర్శించారు.