డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు ఖాయం: డీకే శివకుమార్

డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు ఖాయం: డీకే శివకుమార్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. డిసెంబర్9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6గ్యారంటీల అమలు జరుగుతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతున్నా యన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావట్లేదంటున్న కేసీఆర్ కుటుంబమంతా వచ్చి చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు. 

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, దళితులకు వెన్నుపోటు పొడిచిన మోసకారి కేసీఆర్ అని డీకే శివకుమార్ విమర్శించారు. దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వని బీఆర్ ఎస్ ప్రభుత్వం.. నిరుద్యోగ యువతచావుకు కారకుడైన సీఎం కేసీఆర్ ను ఇంటి పంపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని శివకుమార్ అన్నారు. 

బీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటేనని.. కేంద్రం తెచ్చిన అన్ని చట్టాలకు బీఆర్ ఎస్ మద్దుతు తెలపడమే ఇందుకు సాక్ష్యం అని అన్నారు. కేసీఆర్ అవినీతి చేసిండు అని బీజేపీ ఆరోపిస్తోంది కానీ విచారణ ఎందుకు చేపట్టడం లేదని.. బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య లోపాయికారిఒప్పందం ఏంటో చెప్పాలని అన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ లు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని..  కర్ణాటకలో అమలు చేస్తున్నట్లే తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని డీకే శివకుమార్ అన్నారు.