ఏ రాష్ట్రంలో లేని విధంగా జూడాల‌కు 15 శాతం స్టైఫండ్

ఏ రాష్ట్రంలో లేని విధంగా జూడాల‌కు  15 శాతం స్టైఫండ్

హైద‌రాబాద్: క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయ‌ని ఇంకో వారం రోజుల్లో ఇంకా కేసులు తగ్గుతాయన్నారు డీఎంఈ ర‌మేష్ రెడ్డి. బుధ‌వారం ఆయ‌న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..పోస్ట్ కోవిడ్ లో భాగంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ లు, అనేక జబ్బులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 50శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నాయని..క‌రోనా నుంచి రికవరీ ఆయిన్ తర్వాత‌.. కొంత మందిలో వేరే జబ్బులు వస్తున్నాయన్నారు. లంగ్స్ పాడవుతున్నాయని, గుండె జబ్బులు వ‌స్తుండ‌టంతో టెస్ట్ లు చేయించుకోవాల‌న్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని పోస్ట్ కోవిడ్ ఔట్ పేషంట్ బ్లాక్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో రోగికి ట్రీట్ మెంట్ తో పాటు అవసరమైతే అడ్మిట్ చేస్తారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని..గాంధీ, ఈఎన్టీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్

ఇస్తుండ‌గా .. రోజు 20 కేసులకు ఆపరేషన్ చేస్తున్నార‌న్నారు.  5 టేబుల్స్ లో కంటిన్యూగా ఆపరేషన్స్ జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. బ్లాక్ మార్కెట్ ను నియంత్రణకు కమిటీ పెట్టామని..కోవిడ్ వచ్చి ఇంటికి వెళ్ళాక కూడా మాస్క్ ధరించాల‌న్నారు.  బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని..ఈఎన్టీ హాస్పిటల్ లో ఓపి కూడా పెట్టామన్నారు. బ్లాక్ ఫంగ‌స్ లో ఫేస్ బోన్స్ నొప్పి, ఫేస్ మీద నల్ల చుక్కలు వస్తాయి... లక్షణాలు ఉంటే చూపించాల‌న్నారు. జ‌నం కోవిడ్ కంటే బ్లాక్ ఫంగస్ కు ఎక్కువగా భయ పడుతున్నారని తెలిపారు. 

జూడాలకు 15 శాతం స్టైఫండ్ ఇష్యూ చేశామ‌ని..సీనియర్ రెసిడెంట్స్ కు 70 వేలు ఇస్తున్నామన్నారు. జూడాల‌కు 15 శాతం పెంచుతున్నామని..కోవిడ్ కోసం 15 వందల మందిని తీసుకున్నామన్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ కు నిమ్స్ హాస్పిటల్ కాకా మ‌రికొన్ని హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి జూడాలు విధులకు హాజరు కోవాలని కేసీఆర్ కోరారని తెలిపారు డీఎంఈ ర‌మేష్ రెడ్డి.