గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి : డీఎం హెచ్వో తుకారం రాథోడ్

గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి :  డీఎం హెచ్వో తుకారం రాథోడ్
  •     డీఎం హెచ్​వో తుకారం రాథోడ్​ 

భద్రాచలం, వెలుగు :  ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్​వో తుకారం రాథోడ్​ ఆదేశించారు. స్థానిక గిరిజన అభ్యుదయ భవన్​లో భద్రాచలం డివిజన్​ లెవల్​ వైద్య, ఆరోగ్య సిబ్బందితో ఆయన శుక్రవారం రివ్యూ నిర్వహించారు. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చలి పెరుగుతున్నందున సిబ్బంది పల్లెల్లో ఇంటింటికి వెళ్లి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్​ ఫీవర్లపై సర్వే నిర్వహించి, రక్తనమూనాలు సేకరించాలన్నారు. 

వ్యాధి నిర్ధారణను బట్టి వారికి వెంటనే చికిత్స అందించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆయుష్మాన్​ ఆరోగ్య మందిర్​ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈనెల 18 నుంచి 31 వరకు ప్రతీ గిరిజన గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఐసీడీసీ సర్వే ముమ్మరంగా చేపట్టాలన్నారు. ప్రతినెలా 14న తప్పనిసరిగా ప్రతీ సబ్​ సెంటర్​లో హెల్త్ మేళా నిర్వహించాలన్నారు. 

ప్రతినెలా మూడో శనివారం జనని ఆరోగ్య సమితి కమిటీ సమావేశాలు జరిపి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మందులు నిల్వ ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ డీఎం ​హెచ్​వో సైదులు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎం హెచ్​వోలు శ్రీధర్, స్పందన, ఎన్​వీబీడీసీ ప్రోగ్రామ్​ అధికారి తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.