సేమ్ సీన్.. అప్పుడు గవర్నర్కు జరిగిందే.. ఇప్పుడు అన్నామలైకి జరిగింది.. వైరల్ అవుతున్న వీడియో !

సేమ్ సీన్.. అప్పుడు గవర్నర్కు జరిగిందే.. ఇప్పుడు అన్నామలైకి జరిగింది.. వైరల్ అవుతున్న వీడియో !

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై అంటే ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీజేపీని విస్తరించేందుకు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు, కార్యక్రమాలు చేసి వార్తల్లోకెక్కారు. అందులో చెర్లకోల కొట్టుకుని నిరసన తెలపడం లాంటి ఇన్సిడెంట్లు వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా అన్నామలైకి ఒక పబ్లిక్ మీటింగ్ లో చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో గవర్నర్ టీఎన్ రవి కి జరిగిన చేదు అనుభవం.. ఇప్పుడు బీజేపీ నేత అన్నామలైకి జరిగటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇటీవల నిర్వహించిన 51వ స్టేట్ షూటింగ్ గేమ్స్ లో ప్రతిభ చూపించిన ప్లేయర్స్ కు మెడల్స్ ఇచ్చే కార్యక్రమంలో అన్నామలైకి అవమానం ఎదురైంది. సూర్య రాజ బాలు అనే షూటర్ అన్నామలై నుంచి గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకోవడాన్ని తిరస్కరించాడు. మెడలో మెడల్ వేస్తుండగా వద్దని చేతితో తీసుకున్నాడు. ఈ సమయంలో షూటర్ కు ఇష్టం లేకున్నా.. మెడలో వేయడానికి అన్నామలై ప్రయత్నించగా నిర్మొహమాటంగా తిరస్కరించాడు. 

ALSO READ : 3 రోజుల్లో నివేదిక ఇవ్వండి

ఈ కార్యక్రమానికి అన్నామలై చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. విన్నర్స్ కు మెడల్స్ మెడలో వేస్తూ అభినందిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. తమిళనాడు పరిశ్రమల మంత్రి TRB రాజా కుమారుడు సూర్య రాజ బాలు అన్నామలై నుంచి మెడల్ తిరస్కరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

సేమ్ ఇలాంటి ఘటనే గతంలో తమిళనాడు గవర్నర్ టీఎన్ రవికి ఎదురైంది. తిరునెల్వేలిలోని మనోన్మనియన్ సుందరనార్ యూనివర్సిటీ 32వ కాన్వొకేషన్ కు హాజరైన గవర్నర్ రవి.. స్కాలర్స్ కు మెడల్స్, పట్టా అందిస్తున్న క్రమంలో విద్యార్థులు తీసుకోకుండా షాకిచ్చారు. జీన్ జోసెఫ్ అనే పరిశోధక విధ్యార్థిని రవి నుంచి డిగ్రీ పట్టా అందుకోకుండా వైస్ ఛాన్స్ లర్ నుంచి అందుకుంది. గవర్నర్ నుంచి వద్దని ఉద్దేశపూర్వకంగానే ఆమె వీసీ నుంచి తీసుకోవడం అప్పట్లో వైరల్ గా మారింది. 

డీఎంకే పార్టీకి చెందిన నాగర్ కోయిల్ డిప్యూటీ సెక్రెటరీ భార్య జోసెఫ్. గవర్నర్ యాంటీ తమిళ్.. యాంటీ తమిళనాడు విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా అతని నుంచి పట్టా తీసుకోలేదని ఆమె అప్పట్లో ప్రకటించింది. దీనిపై అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం రాజకీయాలను యూనివర్సిటీలకు తీసుకొస్తోందని విమర్శించారు.