- బెయిల్ మంజూరు
చెన్నై: షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీపై కామెంట్స్ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్ ఆర్ ఎస్ భారతిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరు పరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను రిలీజ్ చేసినట్లు చెప్పారు. కాగా..డీఎంకేకు చెందిన ఇంకో లీడర్, లోక్‌సభ ఎంపీ దయానిధి మారన్ మద్రాస్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కొంత మందిపై కామెంట్స్ చేశారని ఆయనపై కేసు పెట్టడంతో బెయిల్ కోసం పిటిషన్ వేసినట్లు ఆయన తరఫు లాయర్ అన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు. ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో మాట్లాడిన మాలను వక్రీకరించి, ఫేక్ వీడియో తయారు చేశారని అన్నారు.
