న్యాయం చేయండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటం

న్యాయం చేయండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటం

నారాయణ కాలేజీ యాజమాన్యం వల్లే తన కొడుకు సందీప్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడాన్ని తండ్రి యాదయ్య వెల్లడించారు. దీనికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని, తన కొడుకుకు ఏమైనా జరిగితే..తాము నారాయణ కాలేజీ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అంబర్‌‌పేట్‌లోని నారాయణ జూనియర్‌‌ కాలేజీ క్యాంపస్‌లో టీసీ కోసం వచ్చిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం పెట్రోల్‌ దాడికి దారి తీసింది. స్టూడెంట్‌ లీడర్‌‌ సందీప్‌ పెట్రోల్‌ పోసుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని డీఆర్‌‌డీఓ అపోలో హాస్పిటల్‌కి తరలించారు. 

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి యాదయ్య మీడియాతో మాట్లాడుతూ..తాను ముషిరాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నట్లు.. ముగ్గురు పిల్లలతో ఇక్కడకు వచ్చామన్నారు. పిల్లలను బాగా చదివిపించానని.. కానీ.. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. ఇప్పటివరకు ఏ అధికారి స్పందించలేదని.. ప్రభుత్వం ఇంత వరకు దిగి రాలేదన్నారు. 75 శాతం కాలిన గాయాలున్నాయని.. తన కొడుకు ఆరోగ్యం గురించి ఎలాంటి హామీ ఇవ్వడం లేదని వాపోయారు. ఒక విద్యార్థికి సహాయం చేయాలనే ఉద్ధేశంతో పని చేస్తాడని తెలిపారు.