కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయటమే మార్గం

కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయటమే మార్గం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా టెస్ట్ లు వీలైనంత ఎక్కువ చేయటం ద్వారానే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయకపోవటం కారణంగా కేసులు బయటపడటం లేదని ఫలితంగా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుందని చెప్పారు. స్పీడ్ గా కరోనా టెస్ట్ లు చేయటం వల్ల కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లందరినీ గుర్తించి మరింత వ్యాప్తి చెందకుండా వారిని ఐసోలేషన్ చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కరోనా ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సి చర్యలపై మాట్లాడిన వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పలు సూచనలు చేశారు. కిట్ల కొరత ను తీర్చటం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎకనామిస్ట్ లతో చర్చించాలని కేంద్రానికి సూచించారు.