కొత్త కస్టమర్లను చేర్చొద్దు.. బీఓబీ మొబైల్​యాప్​పై ఆర్​బీఐ ఆంక్షలు

కొత్త కస్టమర్లను చేర్చొద్దు.. బీఓబీ మొబైల్​యాప్​పై ఆర్​బీఐ ఆంక్షలు

ముంబై: బ్యాంక్​ ఆఫ్​ బరోడా మొబైల్​యాప్​BOB​ వరల్డ్​పై  ఆర్​బీఐ ఆంక్షలు పెట్టింది. కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్​బీఐ ఆదేశించింది. ఈ ఆదేశం వెంటనే అమలులోకి వచ్చిందని, సూపర్వైజరీ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్​బీఐ ప్రకటించింది. బాబ్​ వరల్డ్​ మొబైల్​ యాప్​లో కస్టమర్లను చేర్చుకునే విధానం (ఆన్​బోర్డింగ్​)లో కొన్ని సమస్యలున్నట్లు గుర్తించామని వివరించింది. ఈ లోపాలను సరిదిద్దిన తర్వాతే కొత్త కస్టమర్ల చేరికను అనుమతిస్తామని వెల్లడించింది. ఇప్పటికే కస్టమర్లుగా కొనసాగుతున్న వారికి ఈ ఆదేశాల వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆర్​బీఐ  స్పష్టం చేసింది.