ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ అమరులు, ఉద్యమకారులకు ఎమ్మెల్సీ కవిత చెప్పిన క్షమాపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపూల్ రాంరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఆనాడే విభేదించి బయటకు వచ్చి క్షమాపణలు అడిగితే బాగుండేదన్నారు. ఆస్తుల వాటా పంపకాలు, కుటుంబంలో రాజకీయ, దోపిడీ ఆధిపత్యం తప్ప కవితలో మరో రాజకీయ కోణం లేదని విమర్శించారు. ఇలాంటి వారు తెలంగాణ కోసం పనిచేస్తామనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలు మోసపూరిత క్షమాపణలను నమ్మరని, పదేండ్లలో దోపిడీకి గురైన తెలంగాణ మళ్లీ మోసపోదన్నారు. ప్రజలు ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలని ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
