ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు.. షెడ్యూల్ రిలీజ్

ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు.. షెడ్యూల్ రిలీజ్

నిర్మల్, వెలుగు:  మహబూబ్​నగర్​, బాసర ట్రిపుల్ ఐటీల్లో 2026-–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు ఆర్జీయూకేటీ బాసర వైస్ చాన్స్​లర్  గోవర్ధన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 16న నోటిఫికేషన్​ జారీ చేయనుండగా, 18 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్ డేట్స్ తమ అధికారిక వెబ్​సైట్  https://www.rgukt.ac.in/ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.