ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు

ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కరీంనగర్: కరోనా వల్ల పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని,  ఫీజుల పేరుతో విద్యాసంస్థల యజమానులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. కరెంట్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు లేకున్నా స్కూళ్ల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు టీచర్లకు వేతనాల్లో కోత విధించకుండా అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు. వసంత పంచమి వేడుకల్లో భాగంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ హిందూ బంధువులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అజ్ఞానం నుంచి మనల్ని జ్ఞాన లోకంలోకి తీసుకెళ్లే రోజు అని గుర్తు చేసుకన్నారు. పెద్దలందరూ మీ కష్టాలను పిల్లలపై రుద్దకుండా వారు స్వేచ్ఛంగా ఎదిగేలా చూడాలని కోరారు. సమాజం పట్ల, దేశం పట్ల వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. డబ్బు సంపాదన కోసమే విద్య కాదని, వారికి సంస్కారం నేర్పేలా విద్య ఉండాలన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచం అతలాకుతమైనా.. మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశం ఆ ముప్పు నుంచి బయటపడుతోందని చెప్పారు. సోషల్ మీడియా నుంచి పిల్లలు మంచి మాత్రమే నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని బండి సంజయ్ కోరారు.

For More News..

సంగమేశ్వరం పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ

హుండీలు నిండాయని కానుకలు తీసుకోని ఆలయ సిబ్బంది

మంత్రి కొడుకు జీతం కోసం నన్ను బలిచేశారు.. మహబూబాబాద్ సర్కారు డాక్టర్ కన్నీళ్లు

డిప్రెషన్‌లో చాలా రకాలున్నయ్​.. లైఫ్ స్టైల్, మనస్తత్వాన్ని బట్టి లక్షణాలు