నీట్ ను రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో 56 మంది నీట్ ర్యాంకర్ల పిటిషన్

నీట్ ను రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో 56 మంది నీట్ ర్యాంకర్ల పిటిషన్
  •      కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతది 

న్యూఢిల్లీ: నీట్ ఎగ్జాంను రద్దు చేయొద్దంటూ మరికొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లా సహా 56 మంది నీట్ ర్యాంకర్లు పిటిషన్ వేశారు. ‘‘నీట్ ఎగ్జామ్ ను రద్దు చేస్తే కష్టపడి చదివి పాస్ అయిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించినట్టవుతుంది. అందుకే నీట్ ను రద్దు చేయకుండా కేంద్రం, ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వండి. 

అలాగే నీట్ లో అక్రమాలకు పాల్పడినోళ్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వండి” అని కోరారు. కాగా, ఆరోపణల నేపథ్యంలో నీట్ ను రద్దు చేయాలని, ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వీటిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. 

ALSO Read : కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

క్రాస్ ఎగ్జామినేషన్ కు వాయిదాలు ఇవ్వొద్దు.. 

సాక్షుల క్రాస్ ఎగ్జామిన్ కు ట్రయల్ కోర్టులు ఎక్కువ రోజులు వాయిదాలు ఇవ్వడం మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అది కేసు విచారణపై, సాక్షుల భద్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. మర్డర్ కేసులో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కు జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కామెంట్లు చేసింది.