శ్రీ కృష్ణుడు వెనక భాగాన్ని అస్సలు చూడొద్దు.. అలా చేస్తే..

శ్రీ కృష్ణుడు వెనక భాగాన్ని అస్సలు చూడొద్దు.. అలా చేస్తే..

 శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణుని భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి భగవంతుడికి పంచామృతాన్ని సమర్పిస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున రోజున చాలా సార్లు ప్రజలు తెలిసి లేదా తెలియక పెద్ద తప్పులు చేస్తుంటారు. జన్మాష్టమి రోజు చేయకూడని కొన్ని పనులను గురించి, ఇప్పుడు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో మరియు ఉత్సాహంతో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున, ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటారు. కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు, కృష్ణుడిని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని దాటుకుంటూ అతన్ని నందుని ఇంటికి చేర్చాడు. విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

తులసి ఆకులను కోయరాదు

 శ్రీకృష్ణాష్టమి రోజున తులసి ఆకులను కోయకూడదు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది. అయితే, తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడానికైతే మాత్రం, కోయవచ్చని విష్ణుపురాణంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  

ఎవరినీ అగౌరవ పరచకూడదు

కృష్ణుడు అందరిని ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రేమిస్తాడు. అతని ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు. కనుక కృష్ణాష్టమి రోజున పేదలను అవమానించడం, కృష్ణుడిని అసంతృప్తికి లోనుచేస్తుందట. అంతేకాక పేదవారిని హీనంగా చూసినా.. ఎగతాళి చేసినా.. వారిపట్ల అగౌరవంగా వ్యవహరించినా  శని దేవునికి కోపాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అవకాశం ఉంటే  కృష్ణాష్టమి రోజున పేదలను సత్కరించి  పేదలకు విరాళం ఇవ్వాలి. కనుక, కృష్ణాష్టమి రోజున మనం ఎవరికైనా హాని తలపెట్టే, ఆలోచన కూడా చేయకూడదు. 

 చెట్లను నరకకూడదు..

జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా దురదృష్టకరం అని భావిస్తారు. ఎందుకంటే మహాభారతంలోని ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు తాను అన్నింటా మరియు అంతా ఉన్నానని, ఆయనలో అంతా ఉన్నాడని తెలిపాడు. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. 

మాంసాహారాన్ని భుజించరాదు

 హిందూమతం ప్రకారం, భక్తులు మాంసాహార ఆహారాన్ని తీసుకోరాదు. చతుర్మాస సమయంలో, మాంసాహారం నుండి దూరంగా ఉండాలి. నాలుగు నెలల చతుర్మాస సమయంలో, విష్ణువు నిద్రిస్తున్నందున, శివుడు ఆ బాధ్యతలను తాను తీసుకుంటాడు. జన్మాష్టమి రోజున, మద్యం కూడా సేవించరాదు. 

 నలుపు రంగు పదార్థం

 శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి నల్లరంగు పదార్థం సమర్పించవద్దు. అలాగే నల్లని వస్త్రాలు ధరించి దేవుడిని పూజించకండి. నలుపు రంగునుఉపయోగించడం సాధారణంగా అశుభం ,సంతాపానికి చిహ్నంగా పరిగణిస్తారు

బ్రహ్మచార్యం పాటించాలి

 శ్రీకృష్ణాష్టమి రోజునబ్రహ్మచార్యం పాటించాలి. జన్మాష్టమి రోజున శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. జన్మాష్టమి రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి. జన్మాష్టమి రోజున బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయి. 

ఆవును అగౌరవపరచడం

 కృష్ణుడిని తరచుగా గోపాలకుడిగా చిత్రీకరిస్తారు. అతను తన చిన్ననాటి సమయంలో, ఆవులతో దూడలతో ఆడుతున్న చిత్రాలు, ఆయనకు ఆవులు ఎంత ప్రియమైనవో తెలియజేస్తున్నాయి. ఆవులను పూజించే వ్యక్తికి, తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆవులను అగౌరవపరిస్తే, కృష్ణుడిని అసంతృప్తికి గురిచేసినట్లే! జన్మాష్టమి రోజున, ఒక గోశాలకు విరాళము ఇవ్వడం, లేదా ఒక గాయపడిన ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిదని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు..

శ్రీ కృష్ణుని - గుడిలో  వెనుక భాగమును దర్శించకూడదని పండితులు  అంటున్నారు. శ్రీ కృష్ణుని వెనుకభాగాన్ని చూడటం వల్ల ఆ వ్యక్తి పుణ్యాలు తగ్గుతాయని చెబుతున్నారు. శ్రీకృష్ణుని వెనుక అధర్మం నివసిస్తుందని, అతని తత్వం అధర్మాన్ని పెంచుతుందని అంటారు. అంతుచిక్కని రాక్షసుడు కాలయముడిని  అంతం చేయడానికి కూడా శ్రీ కృష్ణుడు అతనికి వెన్ను చూపవలసి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.