ఇండస్ట్రియల్ పార్కుకు భూమిచ్చేది లేదు ..    రాపోల్ గ్రామ రైతుల ఆందోళన

ఇండస్ట్రియల్ పార్కుకు భూమిచ్చేది లేదు ..    రాపోల్ గ్రామ రైతుల ఆందోళన

పరిగి, వెలుగు: ‘మా భూమి – మా హక్కు’ అనే నినాదంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రాపోల్ గ్రామ రైతులు ఆదివారం భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రాపోల్, కాడ్లాపూర్ గ్రామ సరిహద్దుల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కు కోసం సాగిస్తున్న భూసేకరణను అడ్డుకుంటామన్నారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని, ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చే ప్రసక్తే లేదన్నారు. రైతులకు మద్దతుగా సీపీఎం నాయకులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య, అలాగే బీజేపీ నాయకుడు ముకుంద నాగేష్ నిరసనలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.