
ఏపీకి మళ్లోసారి లెటర్ రాసిన కృష్ణా బోర్డు
హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ పనులపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు మల్లోసారి ఆదేశించింది. బోర్డు మెంబర్ హరికేశ్ మీనా గురువారం ఏపీ వాటర్ రీసోర్సెస్ స్పెషల్ సీఎస్‌కు ఈ మేరకు లెటర్ రాశారు. గతంలోనే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టు టెండర్లపై ముందుకెళ్లొద్దని ఆదేశించిందని, అయినా ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. మే 5న జారీ చేసిన జీవో నం.203లోని ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి టెక్నికల్ అప్రైజల్ కోసం డీపీఆర్‌లు ఇవ్వాలని సూచించామని తెలిపారు. ఇప్పటి వరకు సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ డీపీఆర్ తమకు అందలేదని పేర్కొన్నారు. సంగమేశ్వరం లిఫ్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోందని తెలంగాణ అభ్యంతరం తెలిపిందని, ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించారు. బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వస్తేనే పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.
For More News..