
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు వైఎస్ షర్మిల ముఖ్య అనుచరాలు ఇందిరా శోభన్. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే..మరోవైపు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వెంటనే ట్రీట్ మెంట్ అందించాలన్నారు. కేసులకు తగ్గట్టు బెడ్ల సంఖ్యను పెంచాలన్న ఇందిరా శోభన్.. మందులు, ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్ ని పూర్తిగా బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కేటాయించాలని తెలిపారు ఇందిరా శోభన్.