పోస్టుల్లేవని రెగ్యులరైజ్ చేయరట

పోస్టుల్లేవని రెగ్యులరైజ్ చేయరట

ఆందోళనలో గిరిజన ఆశ్రమ స్కూళ్ల కాంట్రాక్టు టీచర్లు
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజేషన్​కు అధికారులు మోకాలడ్డుతున్నారు. పోస్టులు లేవని సాకులు చెప్తున్నారు. అర్హత ఉన్న అందరినీ క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పినా కొందరినే రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసే ప్రయత్నం జరుగుతున్నదని కాంట్రాక్ట్​ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 ఏండ్లుగా పనిచేస్తున్నప్పటికీ సీనియారిటీ పట్టించుకోకుండా సర్కారుకు ప్రతిపాదనలు పంపారని అంటున్నారు.  1,200 మంది అర్హులున్నా 177 మంది పేర్లతో మాత్రమే రెగ్యులరైజేషన్​ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు లేకపోతే తాము ఇన్నాళ్లుగా పనిచేస్తున్న పోస్టులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పోస్టుల్లేకున్నా అవసరమైతే సూపర్‌‌‌‌‌‌‌‌ న్యూమరీ పోస్టుల క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసైనా పర్మినెంట్​ చేస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
 

మొత్తం 1,700 మందిలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కాంట్రాక్టు టీచర్ల రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అభ్యర్థులను సబ్జెక్టుల వారీగా జీవో నంబర్ 45 ప్రకారం డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించుకున్నారు. అప్పటి నుంచి ఏటా వీరికి రెన్యూవల్ ఉత్తర్వులు ఇస్తూ పునర్నియామకం చేస్తున్నారు. ప్రస్తుతం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 1,700 మంది కాంట్రాక్ట్​ టీచర్లుండగా.. ఇందులో 2014 కంటే ముందు 1,200 మంది రిక్రూట్‌‌‌‌‌‌‌‌ అయినవాళ్లున్నారు. వీరిలో చాలా మంది 18 ఏండ్ల సర్వీస్​ నిండినవాళ్లు ఉన్నారు. 2014 కంటే ముందున్న ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారని, ఆ మాటకు కట్టుబడి అర్హులైన 1,200 మందిని రెగ్యులరైజ్​ చేయాలని కాంట్రాక్ట్​ టీచర్లు కోరుతున్నారు. 
 

శాంక్షన్ పోస్టులు 177 మాత్రమే ఉన్నయని..
క్లియర్‌‌‌‌‌‌‌‌ వెకెన్సీ, అగైనెస్ట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ శాంక్షన్‌‌‌‌‌‌‌‌, రూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌, రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ పేరుతో  177 మందిని రెగ్యులరైజేషన్​ కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శాంక్షన్​ పోస్టులు 177 మాత్రమే ఉండటంతో అంత మందినే పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు.  పోస్టులు లేవంటూ మిగతావారి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. అధికారుల ప్రతిపాదనల ప్రకారమే రెగ్యులరైజ్​ జరిగితే సుమారు వెయ్యి మంది కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ అవుతుందనే ఆశతో నెలకు 5 వేల జీతం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారు. ఆ జీతాలు కూడా ప్రతి నెలా రాకుండా ఇప్పటికీ మూడు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారు. ఇక కాంట్రాక్టు వ్యవస్థ ఉండదిగాక ఉండదని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించగా.. కనీసం ఇప్పుడున్న తమ కాంట్రాక్టు ఉద్యోగాలైనా కంటిన్యూ చేస్తరా.. లేదా.. అని కాంట్రాక్ట్​ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 

పోస్టుల్లేకుంటే పని ఎట్ల చేయించుకుంటున్నరు?
18 ఏండ్ల నుంచి గిరిజన ఆశ్రమ స్కూళ్లలో కాంట్రాక్టు టీచర్లుగా చేస్తున్నం. అరకొర జీతాలు.. అవి కూడా లేట్‌‌‌‌‌‌‌‌గా వచ్చినా రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ అవుతుందేమోనని ఆశతో పనిచేస్తున్నం. ఇప్పుడు సర్కారు ఓకే చెప్పింది. కానీ అధికారులు మాత్రం సాకులు చెబుతూ మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నరు. మమ్మల్ని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలి.
                                                                                                                                                         - మాలోతు సోమేశ్వర్, ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, గిరిజన ఆశ్రమ స్కూళ్ల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల సంఘం