వర్క్‌‌ ఫ్రమ్​ హోమ్​లో దమ్ముకొట్టొద్దు

వర్క్‌‌ ఫ్రమ్​ హోమ్​లో దమ్ముకొట్టొద్దు

“ఎంత వర్క్‌‌ ఉన్నా మధ్యలో ఒక దమ్ము కొడితే రిలీఫ్‌‌గా ఉంటుంది భయ్యా”అంటారు సిగరెట్‌‌ లవర్స్‌‌. దాని కోసమే పనికట్టుకుని మరీ బ్రేక్‌‌ తీసుకుంటారు. ఇప్పుడిక వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ కావడంతో ఇంట్లోనే సిగరెట్లు తెగ తాగుతున్నారట. అందుకే, జపాన్‌‌కు చెందిన అతిపెద్ద బ్రోకరేజ్‌‌ కంపెనీ ‘నొమ్యూరా’ కొత్త రూల్‌‌ పెట్టింది. వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్​ చేస్తున్నవాళ్లు వర్కింగ్‌‌ అవర్స్‌‌లో సిగరెట్‌‌ తాగొద్దని ఆర్డర్స్‌‌ ఇచ్చింది. ఎంప్లాయ్‌‌, అతని ఫ్యామిలీ మెంబర్స్‌‌ హెల్దీగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారట వాళ్లు.  అక్టోబర్‌‌‌‌ నుంచి ఈ రూల్‌‌ కచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది. దాంతోపాటుగా స్మోకింగ్‌‌ రూమ్స్‌‌ను కూడా క్లోజ్‌‌ చేస్తున్నట్లు నొమ్యూరా గ్రూప్‌‌ చెప్పింది. జపాన్‌‌లో సిగరెట్లు తాగేవాళ్లు ఎక్కువ కావడంతో, ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉండేందుకు పనిగంటల్లో సిగరెట్‌‌ తాగొద్దని నొమ్యూరా గతంలో రూల్స్‌‌ పెట్టింది. స్మోకింగ్ మానేసిన వర్కర్లకు ఫైనాన్షియల్‌‌ ఎయిడ్‌‌ కూడా ఇచ్చింది. ఆ కంపెనీని చూసి మిగతా కంపెనీలు కూడా ఆ బాటలోనే నడిచాయి. జపాన్‌‌కు చెందిన “ ది నేషనల్‌‌ క్యాన్సర్‌‌‌‌ సెంటర్‌‌‌‌” మార్చిలో నిర్వహించిన సర్వేలో వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌లోనే ఎక్కువ సిగరెట్స్‌‌ తాగుతున్నారని తేలింది. “ ఇంట్లో అయితే ఎలాంటి రూల్స్​ ఉండవనే ఉద్దేశంతో ఎక్కువగా తాగుతున్నారు. పదిమందిలో ఇద్దరు మరీ ఎక్కువగా తాగుతున్నారు. అందుకని ఎంప్లాయిస్‌‌ క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. 2020 మార్చినాటికి 20 శాతం ఉద్యోగులు సిగరెట్‌‌ తాగుతున్నారని తెలిసింది. 2025 కల్లా దాన్ని 12 శాతానికి తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం” అని నొమ్యూరా స్పోక్స్‌‌పర్సన్‌‌ యోషిటకా ఓట్సూ చెప్పాడు.