Kitchen Tips : వేపుడులు కరకరలాడాలి అంటే.. ఇలా చేయండి

Kitchen Tips : వేపుడులు కరకరలాడాలి అంటే.. ఇలా చేయండి

కొన్నిసార్లు ఎంత మనసుపెట్టి వండినా ఫుడ్ టేస్టీగా రాదు. అంతే కాదు వంట కూడా ఆలస్యం అవుతుంది. ఫుడ్ రుచిగా ఉండడంతో పాటు వంట తొందరగా
కావాలంటే ఈ టిప్స్ ట్రై చేయొచ్చు...

• పాస్తా రెసీపీలు చేసేటప్పుడు పాస్తా నానబెట్టిన నీళ్లని పారబోస్తుంటారు చాలామంది. అయితే పాస్తాని నానబెట్టిన నీళ్లలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. 

• ఈ వాటర్ ని సాస్తో కలిపితే పాస్తా రెసిపీ స్మూత్ గావస్తుంది. టేస్టీగా ఉంటుంది. క్రీమీపాస్తా తయారీకి మామూలు నీళ్లకు బదులు పాస్తా వాటర్ వాడితే మంచిది.

• నాన్ స్టిక్ పెనంలో ఆమ్లెట్, పాన్ కేక్ తోపాటు సాల్మన్ చేప వంటి కొన్ని రకాల వంటకాలు టేస్టీగా వస్తాయి. అయితే, నాన్ స్టిక్ పెనం మిగతా పెనాల లెక్క తొందరగా వేడెక్కదు. 

• వీటిలో రోస్ట్ చేయడం కుదరదు. యాసిడ్స్ ఉన్న ఆహారపదార్థాల్ని నాన్ స్టిక్ పెనంలో వండితే పెనం మీది లేయర్ పోతుంది కూడా.

• పెనం వేడెక్కిన తర్వాత నూనె, ఇతర దినుసులు వేయాలి. అంతేకాదు వెజిటబుల్ ఫ్రై చేసేటప్పుడు పెనం వేడిగా ఉంటేనే ఫ్రై క్రిస్పీగా వస్తుంది. వంట కూడా తొందరగా అవుతుంది.

• ఒక్కోసారి బయటకి వెళ్లే హడావిడిలో వేడి ఫుడ్ ని ఫ్రిజ్ లో పెడుతుంటారు కొందరు. ఇలాచేయడం వల్ల ఫ్రిజ్ లో టెంపరేచర్ పెరుగుతుంది. దీనివల్ల ఇతర ఫుడ్స్ తో బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది.

• వంట చేసేటప్పుడు పదేపదే కలపొద్దు. ఇలా చేస్తే ఆయా ఆహారపదార్థాలు ఉడికే టైమ్ మారుతుంది. ఫుడ్ టేస్టీగా రాదు.