కోవర్జిన్ అంటే ఏంటో తెలుసా?

కోవర్జిన్  అంటే ఏంటో తెలుసా?

కోవర్జిన్​... ఈమధ్య  ఇంగ్లీషు డిక్షనరీలో కొత్తగా చేరిన పదం ఇది. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఈ పదానికి ఇప్పటివరకు కరోనా​ సోకనివాళ్లు అని అర్థం. ఫస్ట్​, సెకండ్​వేవ్​లో కరోనా బారిన పడనివాళ్లు కొందరు ఉన్నారు. వీళ్లలో చాలామందికి  థర్డ్​వేవ్​లో కరోనా  వచ్చింది. అయితే, ఇప్పటికీ కొందరికి  ఒక్కసారి కూడా కరోనా రాలేదు. వీళ్లే ‘కోవర్జిన్స్​’. ఆశ్చర్యం ఏమంటే... కరోనా బారిన పడకుండా వీళ్లేం చేస్తున్నారనేది వీళ్లకి  కూడా తెలియదు. కోవర్జిన్స్​ని ఫ్రెండ్స్​ పాపులర్​ సినిమా క్యారెక్టర్ల పేర్లతో పిలుస్తుంటారు. దాంతో, కొందరు కోవర్జిన్స్​ ‘మా ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్’, మేం సూపర్​హీరోలం’ అని అనుకుంటారు. కోవర్జిన్​లో ఒక్కొక్కరు ఒక్కోరకం.

కనిపించని కోవర్జిన్స్

కరోనా టైమ్​లో చాలామంది వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేశారు. ఇంటిదగ్గర ఉన్నా కొందరికి కరోనా వచ్చింది. కానీ, ఆఫీస్​కి వెళ్లి పనిచేసినా కూడా కొందరికి కరోనా రాలేదు. దాంతో వీళ్లు ‘మేము కరోనా వైరస్​కి కనిపించం’ అనుకుంటారు. 

డౌట్​ఫుల్​ కోవర్జిన్స్

‘కరోనా వచ్చిందా?’ అని ఎవరైనా అడిగితే... ‘నాకు ఇప్పటివరకు కరోనా రాలేదంటే నమ్మలేకపోతున్నా. కొన్నిరోజులు గొంతు నొప్పిగా అనిపించింది. కానీ, తొందరగా తగ్గిపోయింది. అప్పుడే కరోనా వచ్చి, పోయిందేమో’ అంటారు వీళ్లు. 

కోవిడ్​ ఫోమో

ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్​ మిస్సింగ్ అవుట్’. అలాగని పార్టీలు, ఫేమస్​ టీవీ షోలు మిస్​ అయ్యామని కాదు. కరోనా రాలేదనే ఫీలింగ్​ని ‘కోవిడ్​ ఫోమో’ అంటారు. ‘మా ఫ్రెండ్స్​కి కరోనా వచ్చింది. నాకూ పాజిటివ్​ వస్తే బాగుండు’ అనుకుంటున్నారట కొంతమంది కోవర్జిన్స్​. ఎందుకంటే... ‘మా రోజుల్లో కరోనా ప్యాండెమిక్​ వచ్చింది. మేము కూడా ఇన్ఫెక్ట్​ అయ్యాం. కోలుకున్నాం’ అని తర్వాతి తరానికి చెప్పుకునేందుకు కరోనా రావాలని కోరుకుంటున్నారు వీళ్లు. 

పారనాయిడ్ కోవర్జిన్

ఇప్పటివరకు కరోనా రాకున్నా కూడా... కరోనా వస్తుందేమోనని భయపడతారు కొందరు. ఆ భయంతో  మళ్లీమళ్లీ ఆర్​టి–పిసిఆర్​ టెస్ట్ చేయించుకుంటుంటారు. 
నలుగురిలో కలవరు. పదే పదే చేతులు కడుక్కుంటారు. అంతేకాదు ఇంట్లో ఉన్నా మాస్క్​ పెట్టుకుంటారు.

కొవిడియోట్​ కోవర్జిన్స్

 కొత్త వేరియెంట్లు వచ్చినా కూడా కొందరికి కరోనా రాలేదు.  దాంతో, మాస్క్​ పెట్టుకున్నా, పెట్టుకోకున్నా ఏం కాదు? అని కొందరు కోవర్జిన్స్​ మాస్క్​ పక్కన పడేస్తున్నారు. అంతేకాదు కరోనా సోకిన వాళ్లకి దూరంగా కూడా ఉండడం లేదు వీళ్లు.