శ్రావణమాసం : పార్వతిదేవి ఆచరించిన వ్రతం ఇదే..!

శ్రావణమాసం : పార్వతిదేవి ఆచరించిన వ్రతం ఇదే..!

శ్రావణమాసం కొనసాగుతోంది.  శుక్ల పక్షం ముగిసింది.. కృష్ణ పక్షంలోకి ఆగస్టు 10న  అడుగుపెట్టాం..శ్రావణమాసం మూడవ మంగళవారం ఆగస్టు 12వ తేదీన వస్తుంది. ఆ రోజున మంగళగౌరీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని పార్వతిదేవి ఆచరించిందని పండితులు చెబుతున్నారు.  

శ్రావణమాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, భర్త క్షేమం కోసం ఆచరిస్తారు.  అలానే పార్వతిదేవి కూడా ఈ వ్రతం ఆచరించింది. ఈ వ్రతాన్ని వివాహం జరిగిన తరువాత మొదటి సంవంత్సరం నుంచి  ఐదేళ్లు ఆచరించి, ఆరో సంవత్సరంలో ఉద్యాపన చేయాలి.  ఈ వ్రతంలో మంగళగౌరీ దేవిని పూజిస్తారు. దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని కూడా అంటారు.  

శ్రావణమాసం మంగళవారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం పార్వతిదేవి ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.   ఈఏడాది శ్రావణమాసం మూడవ మంగళవారం, అంటే ఆగస్టు 12వ తేదీన,  వస్తుంది, శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని స్త్రీలు తమ సౌభాగ్యం కోసం జరుపుకుంటారు. 

శ్రావణమాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్రతాన్ని చేసిన వారికి సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం.  అందుకే కొత్తగా పెళ్లయిన వారు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తారు.  

►ALSO READ | కిచెన్ తెలంగాణ: సోయాచంక్స్తో పకోడీ, మంచూరియా, టిక్కీ.. టేస్టీగా, సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయండి !

పురాణాల ప్రకారం పరమేశ్వరుడు కూడా మంగళగౌరీ దేవిని పూజించి త్రిపురాంత సంహారం చేశాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  వివాహమైన తరువాత మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు  పుట్టింట్లో చేయాలి.  తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే వారు తల్లికి వాయినం ఇవ్వాలి.  అలా కాని పక్షంలో అత్తగారికి కాని.. ఇతర ముత్తైదువులకు కాని వాయనం అందిస్తారు. 

వ్రత నియయాలు:

  • వ్రతం చేసుకునే ముందు రోజు, వ్రతం రోజు కూడా భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
  •  వ్రతం రోజు వ్రతం చేసుకునే మహిళలు ఉపవాసం చేయాలి.
  •  వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. 
  • వ్రతం చేసుకునే అన్ని మంగళవారాలలో ఒకే మంగళ గౌరీ దేవి విగ్రహాన్ని ఉపయోగించాలి. 
  • మంగళవారం  వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు. ఎందుకంటే సౌభోగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు.