ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చుకోవాలా ? జస్ట్ ఇలా ఒక్కరోజులో మార్చుకోవచ్చు..

 ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చుకోవాలా ? జస్ట్ ఇలా ఒక్కరోజులో మార్చుకోవచ్చు..

మీరు కూడా ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఆధార్‌లో ఫోటో మార్చుకోవడానికి లేదా ఫోటో అప్ డేట్ చేసుకోవడానికి UIDAI మార్గాలను  మరింత సులభం చేసింది. దింతో  మీరు డైరెక్ట్  మీ దగ్గరలోని  ఆధార్ సర్వీస్ సెంటరుకి వెళ్లి అక్కడ మీరు కేవలం సర్వీస్ చార్జెస్ కట్టి మీ ఫోటోను మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి ఎలాంటి ఆన్‌లైన్ పద్ధతి లేదు, కాబట్టి  మీ కొత్త ఫోటో వెంటనే అక్కడే తీసుకుంటారు.  ఆధార్ అప్‌డేట్ చేయడానికి UIDAI కొత్త ఛార్జీలను కూడా నిర్ణయించింది.  

ఫోటో మార్చడానికి ఎం కావాలి : ఆధార్‌లో ఫోటో మార్చడానికి ఎలాంటి ఐడి ప్రూఫులు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. అయితే ఆధార్ ఫోటో అప్‌డేట్ కావడానికి దాదాపు 30 రోజులు టైం పడుతుంది, ఆ తర్వాత కావాలనుకుంటే అప్‌డేట్ చేసిన ఇ-ఆధార్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఆధార్ కార్డులో ఫోటో ఎక్కడ మార్చుకోవచ్చు: ముందుగా  UIDAI అధికారిక వెబ్‌సైట్ నుండి మీకు దగ్గరలోని  ఆధార్ సర్వీస్ సెంటర్  లేదా ఆధార్ కరెక్షన్ సెంటర్ కోసం సెర్చ్ చేయండి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేయలేరు కాబట్టి నేరుగా ఆధార్ సెంటరుకి  వెళ్లాల్సి ఉంటుంది.  అక్కడ ఆధార్  రిజిస్టర్/కరెక్షన్ ఫామ్ నింపండి. ఈ ఫామ్‌ను UIDAI వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సెంటరులో కూడా  ఉంటుంది. దీన్ని  నింపి  అలాగే మీరు బయోమెట్రిక్స్ ద్వారా మిమ్మల్ని మీరు వెరిఫై చేయాల్సి రావచ్చు. అంటే మళ్ళీ మీ వేలి ముద్రలు తీసుకుంటారు.  

లైవ్ ఫోటో: అక్కడ ఉన్న సిబ్బంది లైవ్ కెమెరా ఉపయోగించి మీ కొత్త ఫోటో తీస్తారు. మీరు ఎలాంటి పర్సనల్ లేదా పాస్ ఫోటో ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత రూ. 100 కట్టాలి. ఫామ్‌ ఇచ్చ్చేటప్పుడు మీకు URN (అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్) ఇస్తారు, దీనితో మీ అప్‌డేట్ స్టేటస్  ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా ఆధార్ అప్‌డేట్ కోసం 30 రోజులు పడుతుంది, కానీ కొన్నిసార్లు 90 రోజులు కూడా పట్టొచ్చు.