సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిండు

సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిండు

వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటు వస్తోంది. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి ఇన్ టైమ్ లో  సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసిటేషన్‌) చేస్తే బతికే అవకాశం ఉంటుంది. తాజాగా బెంగళూరులోని IKEA షాపింగ్ మాల్ లో ఇలాంటి ఘటనే జరిగింది.

ఐకియాలో షాపింగ్ కు వచ్చిన ఓ వ్యక్తికి హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. అయితే షాపింగ్ కు వచ్చిన ఆర్థోపెడిక్ సర్జన్ కావడంతో వెంటనే స్పందించాడు. 10 నిమిషాల పాటు సీపీఆర్ చేసి సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ డాక్టర్‌ కుమారుడు రోహిత్ డాక్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్ గా మారింది. గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన  వైద్యుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకరి  ప్రాణం కాపాడటం కన్నా సంతృప్తి ఇంకేముంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.