రోడ్డుపై డాక్టర్‌ నిరసన..తాళ్లతో కట్టి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

రోడ్డుపై డాక్టర్‌ నిరసన..తాళ్లతో కట్టి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

కరోనావైరస్ నియంత్రణ కోసం విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు సరైన మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన డాక్టరు సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. తనను అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ.. డాక్టర్ సుధాకర్ శనివారం రోజు పోర్టు ఆస్పత్రి దగ్గర అర్ధనగ్నంగా నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో.. ఆయనను తాళ్లతో బంధించి స్టేషన్ కు తరలించారు. డాక్టర్ సుధాకర్ పై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. సుధాకర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆయన మానసికంగా బాధపడుతున్నారు. మొన్నటివరకు ఎంతోమందికి వైద్యం చేసిన ఒక డాక్టరును క్రిమినల్ లాగా తాళ్లతో కట్టి స్టేషన్ కు తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కూడా సుధాకర్ ను డాక్టర్ లాగా కాకుండా.. ఓ క్రిమినల్ లాగా తాళ్లతో కట్టి, కొట్టుకుంటూ తీసుకెళ్లారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

టోల్ గేట్ రేకులు కూలి దంపతులు మృతి

లాక్డౌన్ లో సీజ్ అయిన బండి కావాలంటే ఇలా చేయాల్సిందే!

లాక్డౌన్ లో సొంతూరికి వెళ్లడం కోసం ఏం దొంగతనం చేశాడో తెలుసా..