వాట్సాప్​ వీడియో కాల్​ ద్వారా డెలివరీ చేసిన డాక్టర్లు

వాట్సాప్​ వీడియో కాల్​ ద్వారా డెలివరీ చేసిన డాక్టర్లు
  • కాశ్మీర్​లోని మారుమూల గ్రామం కేరాన్ పీహెచ్​సీ​లో ఘటన

కేరాన్: కాశ్మీర్​లోని మారుమూల పల్లెలో ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్భిణికి.. గైనకాలజిస్ట్​ వీడియోకాల్​లో డాక్టర్​ ను ఫాలో అవుతూ పీహెచ్​సీ సిబ్బంది డెలివరీ చేశారు. ఈ ఘటన  కుప్వారా జిల్లాలోని కేరాన్​ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పీహెచ్​సీకి సమీపంలోని క్రాల్​పోరా సబ్ డిస్ట్రిక్ట్​  ఆస్పత్రికి వెళ్లే రోడ్డు సరిగ్గా లేదు. రాత్రి కూడా కావడంతో వెంటనే గర్భిణిని  అక్కడికి తీసుకెళ్లే చాన్స్​ లేకుండాపోయింది. దీంతో ఏం చేయాలో అర్ధంకాక.. కేరాన్​ పీహెచ్​సీ సిబ్బంది వెంటనే క్రాల్​పోరా ఆస్పత్రి  డాక్టర్​ పర్వేజ్​కు వాట్సాప్​ వీడియో కాల్​ చేశారు. ఆయన ఫోన్​లో సూచనలు చెబుతుంటే పీహెచ్​సీ స్టాఫ్​ డెలివరీ చేశారు. ఆడ శిశువుకు ఆ మహిళ జన్మనిచ్చింది. తల్లీ,బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.