
హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడం సినీ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేసింది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరైన విశాల్.. స్టేజీ మీదనే స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
వైద్య పరీక్షల అనంతరం విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. రెగ్యులర్ మీల్స్ స్కిప్ చేయడం వల్లనే తో కళ్ళు తిరిగాయని తెలిపారు. విశాల్ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. రెగ్యులర్ గా ఫుడ్ టైమింగ్స్ పాటించి, రెస్ట్ లో ఉంటే విశాల్ ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ | Tamil Hero Vishal: వేదిక పైనే స్పృహ తప్పి పడిపోయిన సినీ నటుడు విశాల్.. వీడియో వైరల్
తమిళనాడు విల్లుపురంలో ఆదివారం (మే 11) రాత్రి ‘మిస్ కూవగం 2025’ పేరుతో ట్రాన్స్ జెండర్ల అందాల పోటీలు జరిగాయి. చీఫ్ గెస్ట్గా హాజరైన విశాల్ స్పేజ్ పైనే పడిపోవడం తెలిసిన విషయమే. దీంతో వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. విశాల్ భోజనం చేయకపోవడం వల్లనె ఇలా జరిగిందని విశాల్ మేనేజర్ హరి మీడియాతో చెప్పాడు.
‘మద గజ రాజా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో విశాల్ గజగజ వణికిపోతూ, మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు.