
చెన్నై: సినీ నటుడు విశాల్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వేదిక పైనే స్పృహ తప్పి పడిపోయాడు. తమిళనాడు విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు. వేదికపై ఉండగానే విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి అతనిని ఆసుపత్రికి తరలించారు. విశాల్ మేనేజర్ హరి ఈ ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించాడు.
విశాల్ భోజనం చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పాడు. ‘మిస్ కువాగం 2025’ పేరుతో ట్రాన్స్జెండర్ల అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విశాల్ హాజరైన సందర్భంలో అతను స్పృహ తప్పి పడిపోయాడు. విశాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇలా పబ్లిక్ ఈవెంట్లో విశాల్ ఇలా అస్వస్థతకు లోనై పడిపోవడం ఇది రెండోసారి. ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా విశాల్ వేదికపై మైక్ పట్టుకుని వణికిపోతూ కనిపించిన సంగతి తెలిసిందే.
‘మద గజ రాజా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో విశాల్ గజగజ వణికిపోతూ, మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్, ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు.
అంత అనారోగ్యంతో బాధపడుతూ కూడా ‘మద గజ రాజ’ ప్రమోషనల్ ఈవెంట్కు విశాల్ హాజరు కావడంపై అతని కమిట్మెంట్ చూసి అంతా విస్మయం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్లో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్కే కొందరు హీరోలు, హీరోయిన్లే ఎగ్గొడుతున్న ఈరోజుల్లో విశాల్ తను నటించిన సినిమా కోసం ఇంత కమిట్మెంట్తో ఉండటంపై ప్రశంసలొచ్చాయి.