యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

యువతి కడుపులో 10 కేజీల కణితి..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించారు పుణెలోని జల్నా దీపక్ కర్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు. 23ఏళ్ల యువతి కడుపు నుంచి 10 కేజీల కణితిని తొలగిం చారు. దాదాపు గంటన్నర పాటు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు యువతి కడుపులోని కణితిని తొలగించారు. ప్రస్తుతం యువతి కోలుకుంటోంది..త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు.. 

దీపక్  కర్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ లోని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ గైక్వాడ్ నేతృత్వంలో అనస్థీషియా డాక్టర్ మనోజ్ మిసాల్ డాక్టర్లు చంద్రకియా పాటిల్, సాజిత్ షేక్ తో కూడిన డాక్టర్ల బృందం గంటన్న పాటు శ్రమించి యువతి కడుపులోంచి కణితిని తొలగించారు. 

తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్న  23 ఏళ్ల కర్కినోస్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. యువతి కడుపులో పెరుగుతున్న ఈ కణితి ఆమె ప్రాణానికి ప్రమాదం అని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు.. కానీ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును భరించే పరిస్థితి లేకపోవడంలో మహాత్మా జ్యోతిరావు పూలె జన్ ఆరోగ్య యోజన కింద ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 

also read : IPL టికెట్లు బ్లాక్లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్

45 కేజీల బరువున్న  ఆ యువతి కడుపులో 10 కేజీల కణితివల్ల పొత్త కడుపు వాపుతో నరకం చూసిందట. డాక్టర్ గైక్వాడ్ బృందం సమయానుకూలంగా ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోంది.. త్వరలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు.