సీఎం కేసీఆర్కు అల్సర్..హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు

సీఎం కేసీఆర్కు అల్సర్..హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆదివారంఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో సీఎం కేసీఆర్కు అల్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని  ఏఐజి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరోవైపు జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

సీఎం కేసీఆర్ మెడికల్ చెకప్ కోసం ఎప్పుడూ యశోద, నిమ్స్ ఆస్పత్రులకు మాత్రమే వెళ్తుంటారు. అయితే అకస్మాత్తుగా  ఏఐజీకి ఎందుకొచ్చారనేది హాట్ టాపిక్గా మారింది.  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో  సీఎం కేసీఆర్ కు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నారు.