మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పోటీ చేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? : జీవన్ రెడ్డి

మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పోటీ చేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? : జీవన్ రెడ్డి

మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము మంత్రి కేటీఆర్ కు ఉందా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ వాఖ్యలకు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ చేయకుండా కొట్లాడుతానని మినిస్టర్ కేటీఆర్ అనడం హాస్యాదస్పదమన్నారు. ఈ నిబంధన కేటీఆర్ ఒక్కరికేనా..? లేక 119 నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వర్తిస్తుందా..? అని ప్రశ్నించారు. 

ఇన్నాళ్లు మద్యం, డబ్బులు పంపిణీ చేసి గెలుస్తున్నామన్న విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని అడిగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో గెలవడమే ప్రధానం కాదని, అది ఎన్నికల్లో ఒక భాగం మాత్రమే అని చెప్పారు. నిరుపేద వర్గాల ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతన్నారు. ప్రజా సేవే ప్రధానం అని చెప్పారు. తన చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు.