మరుగుదొడ్డిలో చిక్కిన చిరుత తృటిలో తప్పించుకుంది

మరుగుదొడ్డిలో చిక్కిన చిరుత తృటిలో తప్పించుకుంది

కుక్కను చంపడానికి వచ్చిన ఓ చిరుత పులి మరుగుదొడ్డిలో చిక్కింది. ప్రాణభయంతో సుమారు రెండు గంటలు కుక్కతో పాటు అందులోనే ఉండిపోయింది. చివరకు అటవీ శాఖ అధికారులు బంధించేందుకు ప్రయత్నించడంతో టాయిలెట్ నుంచి బయటపడి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక కుక్కె సమీపంలోని కైకంబ అనే గ్రామంలో జరిగింది.

చిరుత పులి బారి నుంచి తప్పించుకోవడానికి కుక్క పరుగులు తీస్తూ ఓ టాయిలెట్ లో దూరింది. కుక్క వెంట వస్తున్న చిరుత కూడా అందులోకి వెళ్లిపోయింది. అయితే ఇంటి యజమాని రేగప్ప టాయిలెట్ కు తాళం వేశాడు. ఓ కిటికీ నుంచి లోపల ఓ వైపు కుక్క, మరోవైపు చిరుత పులి ఉండడాన్ని సెల్ ఫోన్ లో ఫోటో  తీసి అటవీ శాఖ అధికారులకు పంపించారు.  వారు వల, మత్తు మందు, బోన్ సహాయంతో  చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే చిరుత పులి తృటిలో తప్పించుకొని వెళ్లిపోయింది.