కామెడీ చేయడం చాలా కష్టం.. ఫంకీ మూవీలో ప్రతి ఐదు నిమిషాలకో కామెడీ సీన్

కామెడీ చేయడం చాలా కష్టం.. ఫంకీ మూవీలో ప్రతి ఐదు నిమిషాలకో కామెడీ సీన్

తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది  కయాదు లోహర్.  మూడేళ్ల క్రితమే శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ చిత్రంలో ఆమె నటించినా అంతగా గుర్తింపు దక్కలేదు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తమిళ చిత్రం ‘డ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో మాత్రం  అటు కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇటు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రేజీ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తోంది. 

రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తాను.. కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘ఫంకీ’ సినిమా చేస్తున్నాని చెప్పింది. కంప్లీట్ కామెడీ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ మూవీ తెరకెక్కుతోందని చెప్పిన కయాదు.. ‘ఈ చిత్రంలో ప్రతి ఐదు నిమిషాలకు వచ్చే సీన్ చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఇందులోని డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా  షూటింగ్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే దర్శకుడు  స్పాంటేనియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాసేవారు.  

ఇప్పటివరకు నేను ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నవ్వించగలనని భావించేదాన్ని. కానీ ఈ మూవీ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  కామెడీ చేయడం ఎంత కష్టమో నాకు తెలిసింది. కామెడీ ఎంత నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటే అంత ఫన్ జనరేట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’ అని చెప్పింది. అలాగే  టోవినో థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నట్టు చెబుతూ అది పీరియాడికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోందని తెలియజేసింది.  మరోవైపు కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  శివకార్తికేయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓ మూవీ, టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నాని ‘ది ప్యారడైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాలతో పాటు రవితేజ కొత్త చిత్రంలోనూ కయాదు లోహర్ నటిస్తుందని తెలుస్తోంది.