
- లోకల్ మార్కెట్‌లో గోల్డ్(10 గ్రాములు) రూ. 48,800 వరకు తగ్గే అవకాశం
బిజినెస్‌డెస్క్, వెలుగు: గోల్డ్ రేట్లు వరసగా ఆరో వారం కూడా తగ్గాయి. గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంక్‌లు మానిటరీ పాలసీలను కఠినతరం చేయడంతో గోల్డ్ రేట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నెలలో జరిగే పాలసీ మీటింగ్‌లోనూ ఫెడ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఫలితంగా డాలర్ వాల్యూ పెరుగుతోంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే గోల్డ్ రేటు తగ్గుతుంది. గ్లోబల్‌గా ఆరు మేజర్‌కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ వాల్యూని కొలిచే డాలర్ ఇండెక్స్ వరసగా మూడో వారంలో కూడా పెరిగి 109.97 వద్ద 20 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు యూఎస్ ఎకానమీ కూడా పెద్దగా రికవరీ కావడం లేదు. యూఎస్‌మాన్యుఫాక్చరింగ్ ఆగస్టు నెల పీఎంఐ డేటా మెరుగుపడకపోవడంతో గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. యూఎస్ ఆగస్ట్ నెల జాబ్స్ డేటా 3,15,000 గా నమోదయ్యింది. జులైలో నమోదయిన 5,28,000 తో పోలిస్తే ఇది తక్కువ. యూఎస్‌లో నిరుద్యోగం రేటు ఆగస్టు నెలలో 3.7 శాతానికి పెరిగింది. యూరో జోన్ విషయానికొస్తే, యూరప్‌లోఇన్‌ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టమైన 9.1 శాతానికి చేరుకుంది. ఫలితంగా యూరప్ సెంట్రల్‌బ్యాంక్ వచ్చే వారం వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలూ ఎక్కువయ్యాయి.
గోల్డ్ పరిస్థితి..
ఇంటర్నేషనల్ మార్కెట్‌గోల్డ్ రేట్లు వరసగా ఆరు వారాల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. కానీ, గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్‌రేటుకి 1,680 డాలర్ల వద్ద దీర్ఘకాల సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర కొనుగోళ్లు రావొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం గోల్డ్ (ఔన్సు) రేటు 1,716 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ప్రస్తుతం మార్కెట్ ఫోకస్ అంతా గ్లోబల్‌ఎకానమీ స్లోడౌన్‌పై మారిందని, గోల్డ్‌కు గిరాకీ పెరగొచ్చని ఎనలిస్టులు అంచనావేశారు. సమీప కాలంలో గోల్డ్ రేటు ఒకే రేంజ్‌లో కదలాడొచ్చని పేర్కొన్నారు. లోకల్ మార్కెట్‌లో చూస్తే గోల్డ్ రేటుకి (10 గ్రాములు) రూ.48,800 (ఫ్యూచర్స్) వద్ద సపోర్ట్ లభించొచ్చని అన్నారు. ఈ లెవెల్ నుంచి రికవరీ అయితే గోల్డ్ రేటు రూ.51,200 –రూ. 51,500 (ఫ్యూచర్స్) వరకు వెళ్లొచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 05 గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాములు) రూ.50,384 వద్ద ట్రేడవుతోంది. అదే స్పాట్ మార్కెట్‌లో గోల్డ్ (10 గ్రాములు) రూ. 52,300 పలుకుతోంది. ఒక వేళ గోల్డ్ (ఔన్సు) రేటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 1,680 డాలర్ల కింద లేదా లోకల్ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ.48,800 లెవెల్ కింద క్లోజ్ అయితే గోల్డ్ ధరలు మరింత తగ్గొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.
ఈ వారం గోల్డ్ కదలిక..
గోల్డ్ కదలికలను ఈ వారం అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. డాలర్ వాల్యూలో మార్పులు కీలకం కానున్నాయి. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ లెవెల్ నుంచి ఈ ఇండెక్స్ కొంత తగ్గినా, గోల్డ్ రికవరీ అవ్వడం చూడొచ్చు. అదే డాలర్ వాల్యూ మరింత పెరిగితే మాత్రం గోల్డ్ రేటు రికవరీ అవ్వడంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దీంతో పాటు ఒపెక్ + మీటింగ్ ఈ వారం ప్రారంభంలో జరగనుంది. చైనాలో ఆయిల్ డిమాండ్ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒపెక్ ప్లస్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించాలని నిర్ణయించుకుంటే మాత్రం క్రూడాయిల్ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా గ్లోబల్‌గా ఇన్‌ఫ్లేషన్ ఎక్కువవుతుంది. ఈ ప్రభావం గోల్డ్ రేట్లపై పడుతుంది. సాధారణంగా డాలర్ వాల్యూ పెరిగితే ఇండియా వంటి దేశాల్లో గోల్డ్ కొనడం ఖరీదుగా మారుతుంది.