మార్కెట్లోకి బిబా పండుగ కలెక్షన్

మార్కెట్లోకి బిబా పండుగ కలెక్షన్

హైదరాబాద్​, వెలుగు: దేశీయ ఫ్యాషన్ బ్రాండ్ బిబా తన సరికొత్త పండుగ కలెక్షన్​ను హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న తన ప్రధాన స్టోర్​లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో నటి అనుపమ పరమేశ్వరన్​ పాల్గొన్నారు. బ్రాండ్ ఫిలాసఫీ అయిన “డిఫరెంట్ బై డిజైన్”కు అనుగుణంగా, ఈ కొత్త కలెక్షన్​ను ఆధునిక భారతీయ మహిళల అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఈ కలెక్షన్​లో ఆకర్షణీయమైన రంగులు, చక్కటి ఎంబ్రాయిడరీలు, సమకాలీన డిజైన్లు ఉన్నాయి.

సంప్రదాయ వేడుకల నుంచి ఆధునిక పార్టీల వరకు అన్ని సందర్భాలకు అనుగుణమైన దుస్తులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.  కొత్త కలెక్షన్​లోని లెహంగాలు, ఫ్యూజన్ సెట్లు, ఎంబ్రాయిడరీ సూట్ సెట్లు ఎంతో ఆకట్టుకుంటాయని బిబా తెలిపింది. హైదరాబాద్​లో ఇప్పటికే బీబాకు 20 స్టోర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 12 స్టోర్లు ఉన్నాయి.