నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై.. కాసేపటికే లాభాల్లోకి వచ్చినా..  అది ఎక్కవ సేపు నిలవలేదు. దీంతో మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు నష్టపోగా.. నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం పరిణామాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, దేశీయంగా చమురు ధరల పెరుగుదల సూచీలను కలవర పెడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాల్ని చవిచూడగా.. ఆసియా- పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. గతవారంతో పోలిస్తే.. చమురు ధరలు 20 శాతం పెరిగాయి. దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్ ధరల్ని పెంచాయి. వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ ద్రవ్యోల్బణ భయాల్ని పెంచాయి. ఆర్థిక మందగమనం మనకు రాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇవ్వడం మార్కెట్లకు సానుకూలంగా కనిపిస్తోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.38 రూపాయల వద్ద కొనసాగుతుంది. 

 

ఇవి కూడా చదవండి

యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

రాత్రిపూట యువకుడి పరుగుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా