- 18 రోజుల్లో 123 కంప్లైంట్లు నమోదు
- ప్రకటించిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
- కంప్లైంట్ చేసేందుకు 7217735372 నంబర్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్ వేళ గృహహింస కేసులు పెరిగిపోతున్నాయని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సీడబ్ల్యూ) ప్రకటించింది. 18 రోజుల్లో 123 ఫిర్యాదులు అందాయని చెప్పింది. లాక్‌డౌన్ విధించిన తర్వాత కేసులు పెరిగాయని చెప్పింది. మార్చి 23 నుంచి ఈనెల 10 వరకు మహిళా సమస్యలకు సంబంధించి 370 కంప్లైంట్లు వచ్చాయని, వాటిలో అత్యధికంగా 123 గృహహింసకు సంబంధించినవే అని ఎన్‌సీడబ్ల్యూ డేటా రిలీజ్ చేసింది. ఈ కంప్లైంట్లన్నీ కేవలం ఈ మెయిల్ ద్వారా వచ్చినవి మాత్రమే అని కమిషన్ పేర్కొంది. మహిళల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ఎన్‌సీడబ్ల్యూ 7217735372 వాట్సాప్ నంబర్‌ను స్టార్ట్ చేసింది. గృహహింసను ఎదుర్కొనే మహిళలకు ఇది ఎమర్జెన్సీ నంబర్ అని కమిషన్ సభ్యురాలు ఒకరు చెప్పారు. ఆ నంబర్ ద్వారా కంప్లైంట్ చేస్తే వెంటనే వచ్చి యాక్షన్ తీసుకుంటామని కమిషన్ ట్వీట్ చేసింది.
