బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీలను నమ్మొద్దు : కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్య

బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీలను నమ్మొద్దు :  కాంగ్రెస్ అభ్యర్థి బుట్టి లావణ్య
  •     కాంగ్రెస్​ అభ్యర్థి బుట్టి లావణ్యరమేశ్‌‌‌‌‌‌‌‌

వేములవాడ, వెలుగు: కాలం చెల్లిన బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీలకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని 27వ వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి బుట్టి లావణ్య రమేశ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. శుక్రవారం భగవంతరావునగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే నాయకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక విప్‌‌‌‌‌‌‌‌, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్​నాయకత్వంలో అభివృద్ది చెందుతోందన్నారు. వార్డు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా ఉంటానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.