డాన్ బాస్కో మూవీ షూట్ కంప్లీట్

డాన్ బాస్కో మూవీ షూట్ కంప్లీట్

‘ప్రతి రీ యూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్) కోసం కూడా ఉంటాయి’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. నిర్మాత సూర్యదేవర నాగవంశీ బావమరిది రుష్య దత్త ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. పి.శంక‌‌‌‌‌‌‌‌ర్ గౌరి దర్శకత్వంలో  రాధాకృష్ణ ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వెంకట్ ఉప్పుటూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో రుష్య దత్త  చేతిలో పొడవాటి  కత్తిని పట్టుకుని స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. జైలర్, నా సామిరంగ సినిమాలతో గుర్తింపు పొందిన  మిర్నా మీనన్ ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. మురళీ శర్మ, రాజ్ కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.