అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం..

ఎన్నికల హడావుడిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు విషాదకర సంఘటన ఎదురైంది. ఆయన తమ్ముడు రాబర్ట్ ట్రంప్ శనివారం రాత్రి కన్నుమూశారు. డోనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లేముందు.. న్యూయార్క్ ఆసుపత్రిలోని తన తమ్ముడు రాబర్ట్ ట్రంప్ ని చూసి వెళ్లారు. అది జరిగిన మరుసటి రోజే రాబర్ట్ ట్రంప్ మరణించారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

‘ఈ రాత్రి నా అద్భుతమైన సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా కన్నుమూసినట్లు నేను విశాద హృదయంతో తెలియజేస్తున్నాను. రాబర్ట్ నా సోదరుడు మాత్రమే కాదు, నాకు మంచి స్నేహితుడు. నేను అతన్ని చాలా మిస్సవుతాను. రాబర్ట్ ఎప్పటికీ నా హృదయంలో ఉంటాడు. రాబర్ట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి కలగాలి’అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.

డోనాల్డ్ ట్రంప్ కంటే రెండెళ్ల చిన్పవాడైన 72 ఏళ్ల రాబర్ట్ ట్రంప్.. డోనాల్డ్ ట్రంప్ యొక్క బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాబర్ట్ అంత్యక్రియలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరవుతారని ట్రంప్ యొక్క సహాయకుడు తెలిపారు.

రాబర్ట్ ట్రంప్ మరణానికి గల కారణాలు అయితే ఇప్పటికి తెలియలేదు. కానీ, అతను అనారోగ్యంతో జూన్‌లో వారానికి పైగా న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చేరి చికిత్స పొందినట్లు సమాచారం. రాబర్ట్ మృతి పట్ల ఇవాంక ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. మా కుటుంబం ఆయనను ఎంతగానో కోల్పోతుందని ఆమె అన్నారు.

For More News..

హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు.. లెవల్ కి మించి నీటిమట్టం

చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

రిటైర్ మెంట్ పై ధోని భార్య హార్ట్ ఫెల్ట్ పోస్ట్