నాకు కరోనా రావడం దేవుడి వరం

నాకు కరోనా రావడం దేవుడి వరం

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వైట్ హౌజ్‌‌కు చేరుకున్న ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. తనకు కరోనా రావడాన్ని దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నట్లు ఆ వీడియోలో ట్రంప్ చెప్పారు. దేవుడు మారువేషంలో తనకు పంపిన వరం ఇదన్నారు. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో భాగంగా రెజెనెరాన్ అనే మందు తీసుకుంటున్నానని అది బాగా పని చేస్తోందన్నారు. ఓవల్ ఆఫీసుకు బయట తీసిన ఈ వీడియోలో ట్రంప్ తనను తాను ఫేవరెట్ ప్రెసిడెంట్‌‌గా పరిచయం చేసుకున్నారు. వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఒక రోజు అయిందని పేర్కొన్నారు. అయితే వీడియోలో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ మాస్క్ కట్టుకోకపోవడం గమనార్హం.