వాషింగ్టన్‌‌‌‌లో 'మురికి'ని శుభ్రం చేయాలి: ట్రంప్

వాషింగ్టన్‌‌‌‌లో 'మురికి'ని శుభ్రం చేయాలి: ట్రంప్
  • తండ్రి సలహాను గుర్తుచేసుకున్న అమెరికా ప్రెసిడెంట్

వాషింగ్టన్ డీసీ: ప్రస్తుత పరిస్థితుల్లో వాషింగ్టన్ డీసీలో పేరుకుపోయిన 'మురికి'ని శుభ్రం చేయాల్సిన అవసరం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇందుకు తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నుంచి తెలుసుకున్న ఓ ముఖ్యమైన సలహాను గుర్తుచేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకోవడం, సుమారు 800 నేషనల్ గార్డ్ సైనికులను మోహరించడం వంటి తన నిర్ణయాన్ని సమర్థించారు. 

ఈ వ్యాఖ్యలపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందిస్తూ "బాగా చెప్పారు" అని ఎక్స్​ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ తన తండ్రి సలహాను ఉటంకిస్తూ.. "నా తండ్రి ఎప్పుడూ ఇలా చెప్పేవారు. ఆయన అద్భుతమైన తండ్రి. చాలా తెలివైనవారు. నాకు ఇలా చెప్పేవారు.. 'కొడుకా.. నువ్వు ఒక రెస్టారెంట్‌‌‌‌లోకి వెళ్తున్నప్పుడు దాని ఫ్రంట్​డోర్​ మురికిగా ఉంటే లోపలికి వెళ్లకు. 

ఎందుకంటే గుమ్మం మురికిగా ఉంటే.. వంటగది కూడా మురికిగానే ఉంటుంది'" అని వైట్ హౌస్‌‌‌‌లో మీడియాతో అన్నారు. "మన రాజధాని మురికిగా ఉంటే, మన దేశమంతా మురికిగా ఉన్నట్టే. అందుకే ఎవరూ మనల్ని గౌరవించరు" అని ఆయన స్పష్టం చేశారు.