బిన్ లాడెన్ కొడుకును చంపేసాం : ట్రంప్

బిన్ లాడెన్ కొడుకును చంపేసాం : ట్రంప్

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఒసామా బిన్ లాడెన్ కొడుకు, అల్-ఖైదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ హతమయ్యాడని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

హమ్జా బిన్ లాడెన్ మృతి అల్-ఖైదా నాయకత్వానికి నష్టాన్ని కలిగించడంతో పాటు ఆ గ్రూప్ యొక్క ముఖ్యమైన కార్యాచరణ కార్యకలాపాలను బలహీన పరుస్తోందని వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ట్రంప్ తెలిపారు.

హమ్జా బిన్ లాడెన్  మరణించినట్లు గత నెల ఆగష్టులోనే  ఆ దేశ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ ధృవీకరించారు. అయితే ట్రంప్ మరియు మిగతా ఉన్నతాధికారులు ఆ సమయంలో అతని మృతిపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

హమ్జా బిన్ లాడెన్.. ఒసామా బిన్ లాడెన్ యొక్క 20 మంది పిల్లలలో 15 వ వాడు. లాడెన్  మూడవ భార్య సంతానం హమ్జా. అతని వయస్సు  సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని  సమాచారం. అల్-ఖైదా ఫ్రాంచైజీలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను  పట్టించిన వారికి 1 మిలియన్ డాలర్లు ఇస్తామని 2019 ఫిబ్రవరిలో యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది.

Donald Trump confirms death of Hamza bin Laden,