ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ ఎన్నికల రిజల్ట్స్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లోని 62 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు జరిగిన ఎన్నికలను ఇన్ వ్యాలిడ్ గా ప్రకటించాలంటూ రిపబ్లికన్ పార్టీకి చెందిన టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్ టన్ తో సహా17 రాష్ట్రాల అటార్నీలు ఇప్పటికే సుప్రీంకోర్ట్ లో పిటిషన్ లు వేశారు. తన పిటిషన్ ను కూడా వీటితో కలిపి విచారించాలని కోరుతూ ట్రంప్ బుధవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. అన్ని స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ కన్నా తనకే వేలాది ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఫిక్సింగ్ జరిగితే తప్ప తాను ఓడిపోయే చాన్సే లేదని పేర్కొన్నారు. అయితే పెన్సిల్వేనియా స్టేట్ లో ట్రంప్ లా సూట్ ను కోర్టు మంగళవారమే కొట్టేసింది.

For More News..

మొతెరాలో డే అండ్ నైట్‌ టెస్ట్‌

‘నీట్​2021’ను రద్దు చేయం

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్