యూఎస్‌లో కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకొస్తున్నాం

యూఎస్‌లో కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకొస్తున్నాం

ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్: మెరిట్ ఆధారంగా వీసాలు ఇచ్చే ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై త్వరలో తాను సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. డీఏసీఏ ప్రోగ్రామ్ కింద అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వలసదారుల పిల్లలను సంరక్షిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.

‘మేం అతి త్వరలో ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై సంతకాలు చేయనున్నాం. మెరిట్ ఆధారంగా తీసుకొస్తున్న ఈ విధానం చాలా బలంగా ఉంటుంది. డిఫర్డ్‌ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ అరైవల్స్‌ (డీఏసీఏ)పై మేం పని చేయనున్నాం. ఎందుకంటే మేం ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. డీఏసీఏ వల్ల తమకు మేలు జరుగుతుందని కన్జర్వేటివ్ రిపబ్లికన్స్‌ కూడా ఎదురు చూస్తున్నారు. అందరూ దీన్ని రాజకీయంలా చూశారు. కానీ నేను దీని వల్ల కొంత మంచి జరగాలని నేను భావిస్తున్నా. శక్తిమంతమైన ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై మేం సంతకాలు చేయబోతున్నాం. అది చాలా అద్భుతంగా ఉండనుంది. దీని కోసం దేశం 25 నుంచి 30 ఏళ్లుగా యత్నిస్తోంది. ముఖ్యంగా బార్డర్‌‌లో ఇది సమర్థంగా పని చేయనుంది. మీరు లీగల్‌గా రావాల్సి ఉంటుంది. అది చాలా కీలకం. అలా వచ్చిన వారి క్షేమాన్ని డీఏసీఏ రిపబ్లికన్‌ల తరహాలో చాలా బాగా చూసుకుంటుంది’ అని ట్రంప్ చెప్పారు.