మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌పై వర్క్‌ చేస్తున్నాం: ట్రంప్‌

మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌పై వర్క్‌ చేస్తున్నాం: ట్రంప్‌

వాషింగ్టన్‌: మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కృషి చేస్తున్నారని వైట్‌హౌస్‌ చెప్పింది. టెలిముండో న్యూస్‌ ఛానెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన ఇంటరవ్యూలో ఇమ్మిగ్రేషన్‌పై మాట్లాడిన తర్వాత వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేసింది. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) ప్రోగ్రామ్‌ కింద పౌరసత్వానికి మార్గం ఏర్పడుతుంది అని ట్రంప్‌ చెప్పారు. “ అది చాలా పెద్ద, మంచి బిల్లు అవ్వబోతోంది. మెరిట్‌ ఆధారిత బిల్లు, దాంట్లో డీఏసీఏ కూడా ఉంటుంది. దీని వల్ల ప్రజలు చాలా ఆనంద పడతారు” అని ట్రంప్‌ అన్నారు. యూఎస్‌ వర్కర్స్‌ను మరింత రక్షించేందుకు మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైట్‌హౌస్‌ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. బలమైన సరిహద్దు భద్రత, శాశ్వత మెరిట్‌ ఆధారిత సంస్కరణలతో పాటు పౌరసత్వాన్ని చేర్చగలిగే డీఏసీఏకు శాసన పరిష్కరం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ చెప్పారని వైట్‌ హౌస్‌ చెప్పింది.