
ఈ రోజుల్లో భారత్ అమెరికా మధ్య డిఫెన్స్, వాణిజ్యం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి F-35 ఫైటర్ జెట్‌లను అమ్మడానికి ముందుకొచ్చారు. కానీ ఈ జెట్‌పై మాకు ఆసక్తి లేదని భారతదేశం తాజగా స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2025లో వాషింగ్టన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి అమెరికా భారతదేశానికి ఆయుధ అమ్మకాలను పెంచుతుందని, ఇందులో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జెట్ ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, అలాగే శత్రు దేశాల రాడార్‌లను తప్పించుకోగలదు. ఇంకా చాల రకాల దాడులను నిర్వహించగలదు.
మరోవైపు భారతదేశం చాలా ఎక్కువగా సుంకాలను విధిస్తుందని, దీనివల్ల అమెరికన్ వ్యాపారులకు నష్టం జరుగుతుందని ఆయన గతంలో అన్నారు. ఈ సుంకాల ఒత్తిడిని ఉపయోగించుకోవాలని భారతదేశం F-35 కొనుగోలు చేయాలనీ బలవంతం చేస్తుందని చాలా మంది నమ్ముతారు.
సమాచారం ప్రకారం, F-35 జెట్‌ను కొనడానికి ఆసక్తి లేదని భారతదేశం అమెరికాకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. జూలై 2025లో జరిగిన చర్చలలో ఈ డీల్ ముందుకు తీసుకెళ్లే స్థితిలో లేమని భారత అధికారులు తెలిపారు. కారణం ఈ జెట్ ధర, దాని నిర్వహణ ఖర్చు అలాగే దానిపై భారతదేశానికి ఉన్న సందేహాలు. ఒక జెట్ ధర దాదాపు $80 మిలియన్లు అంటే సుమారు రూ. 670 కోట్లు. దీనితో పాటు శిక్షణ, మౌలిక సదుపాయాల ఖర్చు అదనంగా ఉంటాయి. F-35ను కొనడానికి ముందు దాని ధర, అవసరాన్ని పరిశీలించాల్సి ఉంటుందని భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ AP సింగ్ కూడా అన్నారు.
F-35 అంటే ఏంటి : F-35 అనేది లాక్‌హీడ్ మార్టిన్ నిర్మించిన 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీనికి రాడార్లను తప్పించుకొనే సామర్ధ్యం, అధునాతన సెన్సార్లు ఇంకా గాలి, భూమి, సముద్రంలో దాడి చేసే కెపాసిటీ ఉంది. US, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు దీనిని ఉపయోగిస్తాయి. కానీ దాని ధర, సాంకేతిక సమస్యల కారణంగా ఎప్పుడు వివాదంలో ఉంటుంది. కొంతమంది నిపుణులు ఈ జెట్ నిర్వహణకు చాలా డబ్బు ఖర్చవుతుందని అంటున్నారు.
JUST IN:
— Current Report (@Currentreport1) July 31, 2025
India has informed the United States that it is not interested in purchasing F-35 fighter jets – Bloomberg pic.twitter.com/V0C2AezxGR